ఇంటర్ ​సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

by Disha Web Desk |
ఇంటర్ ​సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్​బోర్డు ప్రకటించింది. ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలను అధికరారులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. గురువారం నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులకు అధికారులు అవకాశం కల్పించారు. జూలై 6వ తేదీ వరకు పేమెంట్స్ కు గడువు విధించారు. ఇదిలా ఉండగా ప్రాక్టికల్​పరీకర్షలను జూలై 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వాల్యుస్‌ పరీక్ష జూలై 27న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఎగ్జామ్‌ను జూలై 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి ఒమర్​జలీల్​ప్రకటించారు.



Next Story