విద్యార్థినిలుపై ఎలుకల దాడి.. ఆరా తీసిన రీజనల్ కోఆర్డినేటర్..

by Disha Web |
విద్యార్థినిలుపై ఎలుకల దాడి.. ఆరా తీసిన రీజనల్ కోఆర్డినేటర్..
X

దిశ , ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ట్రైబల్ బాలికల గురుకుల పాఠశాలను శుక్రవారం మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ సందర్శించారు. ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని ట్రైబల్ గిరిజన గురుకుల విద్యార్థినిలకు ఇటీవల ఎలుకలు కొరకడంతో పది మందికి పైగా కాళ్ళకు గాయాలయ్యాయి. ఈ విషయమై రీజనల్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ ట్రైబల్ బాలికల పాఠశాల్లో జరిగిన సంఘటన పై విద్యార్థినిలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలోకి ఎలుకలు, పాములు ఇతర కీటకాలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఏఎన్ఎం రాత్రి సమయంలో పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక వాహనం ఏర్పాటు చేయాలని కోఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లగా అందుకు ఆయన అంగీకరించి ఇంఛార్జి ప్రిన్సిపాల్ రమ్య శ్రీకి ఆదేశాలు జారీ చేశారు. ట్రైబల్ బాలికల పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపామని నిధులు మంజూరు కాగానే నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైతే సెక్యూరిటీని కూడా నియమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమ్య శ్రీ, శ్రీ ప్రియ,తో పాటు ట్రైబల్ ఉపాధ్యాయురాల్లు తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed