సైలెంట్ వార్‌తో మెదడుపై ఎఫెక్ట్.. మెచ్యూర్డ్ కన్వర్జేషన్స్‌తో ఈజీ సొల్యూషన్!

by Disha Web |
సైలెంట్ వార్‌తో మెదడుపై ఎఫెక్ట్.. మెచ్యూర్డ్ కన్వర్జేషన్స్‌తో ఈజీ సొల్యూషన్!
X

దిశ, ఫీచర్స్: ప్రియమైన వ్యక్తుల నడుమ ఎంత సన్నిహిత సంబంధాలున్నా ఎప్పుడో ఓసారి కలతలు రాక మానవు. సాధారణ వ్యక్తుల మధ్య కోపతాపాలతో పోల్చితే.. ఇలాంటి రిలేషన్స్‌లో తలెత్తే విభేదాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ఏవైనా కారణాల వల్ల ఇష్టమైన వ్యక్తికి కోపాన్ని కలిగిస్తే.. వారు తమపై కేకలు వేయాలని లేదా పర్టిక్యులర్ విషయంలో తమతో పోరాడాలని ఆశిస్తారు. కానీ అవతలివారు సింపుల్‌గా మాట్లాడటం మానేస్తారు. కనీసం కన్నెత్తయినా చూడకుండా నిశ్శబ్ద శిక్షను అమలు చేస్తుంటారు. నిజానికి సూటిపోటి మాటలతో దుర్భాషలాడటం లేదా భౌతికంగా దాడి చేయడం కంటే కూడా ఇదే ఎక్కువగా బాధిస్తుంది. ఒంటరి అనుభూతిని కలిగించి మనసును ముల్లులా గుచ్చుతుంటుంది. అయితే రిలేషన్‌షిప్స్ మధ్య కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటే ఇలా శిక్షించడం సరైనది కాదని, ఇద్దరి మధ్య ప్రేమ శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఎదుటి వారిని ఏవిధంగా అవమానానికి, వేదనకు గురిచేస్తుందో సైకాలజిస్ట్ డాక్టర్ జెన్ ఆండర్స్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు. నిశ్శబ్ద చికిత్సను అమలుచేసే వ్యక్తులు ఈ రకంగా తమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తారే తప్ప మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే దిశగా ప్రయత్నించరు. మానసికంగా అపరిపక్వత కలిగి ఉండి తమ సొంత భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోవడమే కాక వాటిని సరిగా వ్యక్తీకరించలేరు. విభేదాలు తలెత్తినపుడు ఆయా పరిస్థితులపై నియంత్రణ సాధించేందుకు ఈ పద్ధతిని ఒక చీప్ అండ్ క్విక్ ట్రిక్‌గా ఉపయోగిస్తారు. కానీ దాని వెనకున్న హానికర ఫలితాలను అంచనా వేయరు. ఒక రకంగా ఇది వారి అసమర్థతను బయటపెడుతుంది. అయినప్పటికీ ఇది చాలా వ్యక్తిగతంగా అనిపిస్తుంది.

* ఒక రకంగా వేధించడమే..

కలతల తర్వాత ఎదుటి వ్యక్తితో విస్మరించబడటం శారీరక నొప్పి మాదిరిగానే మెదడు ప్రాంతాలపై ఎఫెక్ట్ చూపుతుందని, గాయపడినట్లుగా తీవ్రమైన భావోద్వేగాలను కలిగిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవతలి వ్యక్తికి నొప్పి కలిగించేందుకు ఇదొక శక్తిమంతమైన మార్గం. కోపంలో అనుకోకుండా తూలిన మాట కంటే కూడా ఎక్కువ బాధిస్తుంది.

* ప్రేమ ఆవిరి కావచ్చు..

మనుషులు ఒంటరిగా ఉండలేరు. నిజానికి సంబంధాలను ఏర్పరచుకోవడం, ఇతరులతో కనెక్ట్ కావడం అనేది ఒక లోతైన-ప్రాథమిక మానవ అవసరం. కానీ ప్రియమైన వ్యక్తి తమతో కమ్యూనికేషన్ ఆపేసినపుడు అది నిరాశతో పాటు ఆందోళనకు గురిచేస్తుంది.

* ప్రైవసీ కోరుకోవడం కంటే విభిన్నం..

బాధపెట్టిన వ్యక్తి నుంచి దూరంగా ఉండాలనుకోవడం సాధారణమే కానీ మౌనంగా వ్యవహరించడం అనేది ప్రైవసీ కోరుకున్నట్లు కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా నొప్పిని కలిగించడమే. అర్థమయ్యేలా చెప్పాలంటే.. కుక్క ముందు బొక్కను ఊపడం లాంటిది. కాబట్టి అవతలి వ్యక్తి భావోద్వేగాలతో ఆడుకునే సైలెంట్ ట్రీట్‌మెంట్ ఎంత మాత్రం గొప్ప చర్య కాదు.

అయితే ఈ చర్చ ఆధారంగా ఎవరికైనా సైలెంట్ ట్రీట్‌మెంట్‌ ఇచ్చేందుకు బదులు తిట్టడమే సరైందని భావించకూడదు. ఎప్పుడు కూడా పరిణతి చెందిన సంభాషణలు, భావోద్వేగాలను వ్యక్తపరచడం ద్వారా విభేదాలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed