- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గడియ గౌరారంలో రియల్ దందా..!
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం గల గల గోదావరి మాదిరిగా సాగిపోతోంది.

దిశ, నల్లగొండ బ్యూరో/చింతపల్లి: ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం గల గల గోదావరి మాదిరిగా సాగిపోతోంది. గజాలలో ధర నిర్ణయించి గుంటల్లో విక్రయాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో.. చింతపల్లి మండలం పరిధిలో చింతపల్లి గడియ గౌరారం గ్రామంలో ఏర్పాటుచేసిన వెంచర్‌కు త్వరపడండి. వెంటనే ప్లాట్లు కొనుగోలు చేయండి అంటూ అక్రమ ఫామ్ ల్యాండ్ దర్జాగా కొనసాగిస్తున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం గడియ గౌరారం గ్రామంలో సర్వే నెంబర్ 25లో గ్రామంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లో గుంటలు గుంటలుగా విక్రయాలు జరుగుతున్న అక్రమ రియల్ దందా పై ప్రత్యేక కథనం.
బురిడీ కొట్టించే మాటలతో..?
రియల్ ఎస్టేట్ వ్యాపారులు కస్టమర్లకు ప్లాట్లు కొనుగోలు చేసే వరకు బురిడీ కొట్టించేలా మాయ మాటలు చెప్పి తమ గాడిలో పెట్టుకుంటారు. సెలవు రోజు వచ్చిందంటే చాలు హైదరాబాద్, లేదా ముఖ్యమైన నగరాల నుంచి కస్టమర్లను వెంచర్‌కి తీసుకువచ్చి విందు భోజనం పెట్టి, ఆఫర్లు వివరించి ప్లాట్లు కొనుగోలు చేసే వరకు మాయమాటలు చెప్పి మరి ప్లాట్లు బుక్ చేయిస్తున్నారు. అంతేగాకుండా ఒక సంస్థలో ఒకరితో పరిచయం పెంచుకుని అందులో మిగతా వాళ్లకు ఆఫర్లు ఇచ్చి ప్లాట్ కొనుగోలు ఇచ్చి ప్లాట్లు. కొనుగోలు చేసే వరకు వెంట పడతారు. వీకెండ్ కదా అలా ఒకసారి సరదాగా వెంచర్‌కి వెళ్లి వద్దాం.. జాలీగా ఉంటుంది.. అన్ని రకాల విందులు వాళ్లే చూసుకుంటారని మాయ ముచ్చట్లు చెబుతారు. అయితే ఇలా మాయ మాటలకు మోసపోయిన వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి సాఫ్ట్ వేర్ ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేసే అధికారులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్నారు. అలా మోసానికి గురైన చాలా మంది బాధితులు బహిర్గతంగా చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.
అవగాహన లేకుండా కొనుగోలు చేస్తే..
ప్రతి ఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భూమిపై పెట్టుబడి పెట్టాలని చూస్తారు. కానీ ఆ భూమి పై సరైన అవగాహన లేకపోతే కష్టం చేసిన సొమ్మంతా కాటిపాలైనట్లే. ఒక ప్లాట్ కొనుగోలు చేస్తున్న సమయంలో ఆ వెంచర్ ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉందా.. లేదా.. అనే కనీస విచారణ చేయాల్సిన అవసరం తప్పనిసరి. కానీ తక్కువ ధరకు వస్తుందని పండ్ల మొక్కలతో భవిష్యత్తులో ఆదాయం వస్తుందని తొందరపడి. ఉరుకులు పరుగులతో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా తన తోటి ఉద్యోగి, బంధువులు స్నేహితులు చెప్పారని లక్షలు పెట్టి ప్లాట్లు కొంటున్నారు. కానీ నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్ లో ఇల్లు కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీలో అనుమతి లేదంటూ అధికారులు.
ఇంటి నిర్మాణానికి అడ్డుపడుతుంటారు. అనుమతి లేకపోతే బ్యాంకు నుంచి రుణం రాదు. ఇదంతా ఎందుకు ఇబ్బంది అంటూ ప్లాట్ అమ్ముకుందామంటే ఆరోజు పరిస్థితి రియల్ భూమ్ ఉంటుందో లేదో తెలియదు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా లేకుంటే గతంలో మనం కొనుగోలు చేసిన ధర కూడా వచ్చే అవకాశం ఉండదు. ఆ సమయంలో ప్లాటు కొనుగోలు చేయించిన మార్కెటింగ్ వారు ఎక్కడా కనిపించరు. వెంచర్ యజమాని అడిగితే ప్లాట్లకు ఇప్పుడు ధరలు లేవు. మీరు అనుకున్న ధర రాదు. మేము చెప్పిన ధరకు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీ ఇష్టమని చెప్పి చేతులు దులిపేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా కొనుగోలు చేయడం వల్ల కస్టమర్లకు తీవ్రంగా నష్టం.
వెంచర్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు: కుర్మేటి సురేష్, కార్యదర్శి, గడియ గౌరారం, చింతపల్లి మండలం
గ్రామంలో ఉన్న ఫామ్ ల్యాండ్ వెంచర్‌కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవు. అనుమతుల కోసం దరఖాస్తు కూడా చేసిన దాఖలాలు లేవు. అనుమతులు లేకుండా వెంచర్ ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామన్నారు.






