ఏసీబీ వలలో ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్

by Jakkula.Mamatha |

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ (ENC) మోహన్ నాయక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ​

ఏసీబీ వలలో ఆర్ అండ్ బి ఈఎన్సీ మోహన్ నాయక్
X

దిశ, శేరిలింగంపల్లి: ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఈఎన్సీ (ENC) మోహన్ నాయక్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ​మియాపూర్‌లో ఉన్న మోహన్ నాయక్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, బంధువులు, అత్యంత సన్నిహితుల ఇళ్లలో మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ తనిఖీల్లో భారీగా ఆస్తి పత్రాలు, నగదు, కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ​ఆర్ అండ్ బీ శాఖలో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇల్లే లక్ష్యంగా ఈ స్థాయిలో దాడులు జరగడం అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Next Story