గుర్తుపట్టలేనంతగా మారిన అల్లు అర్జున్.. షాక్‌లో రష్మిక ట్వీట్

by sudharani |
గుర్తుపట్టలేనంతగా మారిన అల్లు అర్జున్.. షాక్‌లో రష్మిక ట్వీట్
X

దిశ, సినిమా : 'పుష్ప' బ్లాక్ బస్టర్‌తో అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత అత‌డి బ్రాండింగ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప‌లు సంస్థల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవ‌హ‌రిస్తున్న బన్నీ.. ప్రస్తుతం యాడ్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ యాడ్‌ షూట్‌‌కు సంబంధించిన న్యూ లుక్‌‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో చెవి పోగు పెట్టుకుని సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టైలిష్‌‌గా కనిపించాడు బన్నీ. అయితే రీసెంట్‌గా ఈ లుక్ చూసిన రష్మిక.. 'ఈ ఫొటోలో ఉన్నది మీరే అని క్షణ‌కాలం పాటు గుర్తించ‌లేక‌పోయా అల్లు అర్జున్ సార్' అంటూ చేసిన ట్వీట్ ఇపుడు వైర‌ల్‌గా మారింది. ఇక 'పుష్ప' మూవీలో బన్నీకి జోడీగా శ్రీవ‌ల్లి పాత్రలో నటించిన రష్మిక.. పర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. మరి 'పుష్ప2'లో వీరిద్దరి కాంబినేషన్ సీన్స్‌ను సుకుమార్ ఎలా తెర‌కెక్కిస్తారో చూడాలి.

Next Story

Most Viewed