మహాత్మ జ్యోతిబాపూలే వర్గల్ మహిళా డిగ్రీ కళాశాల అరుదైన ఘనత

by Jakkula.Mamatha |

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్గల్ మహిళా డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సాధించింది.

మహాత్మ జ్యోతిబాపూలే వర్గల్ మహిళా డిగ్రీ కళాశాల అరుదైన ఘనత
X

దిశ,​వర్గల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మహాత్మ జ్యోతిబాపూలే వర్గల్ మహిళా డిగ్రీ కళాశాల అరుదైన ఘనత సాధించింది. రీసెర్చ్ హైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఇంపాక్ట్ సమ్మిట్ అండ్ అవార్డ్స్-2026’లో సదరు కళాశాల ‘సస్టైనబుల్ క్యాంపస్’గా ఎంపికై ప్లాటినం సర్టిఫికెట్‌ను అందుకుంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. భాస్కర్ రావు మంగళవారం వెల్లడించారు. దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనేక విద్యాసంస్థలు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక సదస్సులో వర్గల్ మహిళా కళాశాల తనదైన ముద్ర వేసింది.

ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, టీజీహెచ్‌ఎస్‌ఈ చైర్మన్ వి. బాలకృష్ణారెడ్డి, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ (టెరి) డైరెక్టర్ శోభన్ బాబు, ప్రముఖ పర్యావరణ వేత్త కే. పురుషోత్తం రెడ్డి, నాబార్డ్ సీజీఎం బి. ఉదయభాస్కర్, ఏఐసీటీఈ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో కళాశాల ప్రతిష్టను పెంచేలా కృషి చేసిన ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ఆఫీసర్ జి. భాగ్యలక్ష్మి, యూనిట్-2 ఆఫీసర్ డాక్టర్ ఎస్. రాధారాణిలను ప్రిన్సిపాల్ డాక్టర్ జి. భాస్కర్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

Next Story