మళ్ళీ తెరపైకి ఈటల భూముల లొల్లి... కలెక్టరేట్ వద్ద ధర్నా

by Dishanational1 |
మళ్ళీ తెరపైకి ఈటల భూముల లొల్లి... కలెక్టరేట్ వద్ద ధర్నా
X

దిశ, మెదక్: తమ భూములు తమకు అప్పగించాలని కోరుతూ బాధిత రైతులు శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. దళిత, మాల మహానాడు, రజక సంఘం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. హకీంపేట, అచ్చంపల్లి గ్రామ శివారులో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చెందిన జమునా హచరీస్ కు సంబంధిన భూముల వివాదం తెలిసిందే. గత ఏడాదిగా సాగుతున్న ఈ వివాదం కోర్టులో నడుస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సర్వే కూడా నిర్వహించినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ శుక్రవారం దళిత, మాల, రజక సంఘాల అధ్వర్యంలో పలువురు బాధిత రైతులతో కలిసి వచ్చి ధర్నా నిర్వహించారు. దీంతో వెంటనే వారిని అదనపు కలెక్టర్ ఛాంబర్ లోకి రప్పించుకుని వినతి పత్రం తీసుకున్నారు. భూముల సర్వే పూర్తయిందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.



బాధితులతో ఫోన్లో మాట్లాడిన కలెక్టర్...

వారితో జిల్లా కలెక్టర్ హరీశ్ ఫోన్లో మాట్లాడారు. 130 సర్వే నెంబర్ లో సర్వేను పూర్తి చేశామని, కోర్టులో 3 రిట్ పిటిషన్ లు ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయిందన్నారు. 337 మందికి పట్టాలు ఇచ్చామని, ఇంకా 87 మందికి ఇవ్వాల్సి ఉందన్నారు. తప్పనిసరిగా బాధిత రైతులకు న్యాయం చేస్తామని, ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఆందోళనలో పలు సంఘాల నేతలతోపాటు బాధిత రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed