- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇలాంటి బహుమతులిచ్చి ప్రపోజ్ చేస్తే.. మీ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే..?

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏటా ఫిబ్రవరి(February) 14 వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని(Valentine's Day) జరుపుకుంటారు. అయితే 14 కు ముందు కొన్నిడేస్ నుంచే ప్రేమికులు.. ఫిబ్రవరి 7 వ తేదీన రోజ్ డే(Rose Day), ఫిబ్రవరి 8 న ప్రపోజ్ డే(Propose day), ఫిబ్రవరి 9 వ తారీకున చాక్లెట్ డే(Chocolate Day), ఫిబ్రవరి 10న టెడ్డీ డే(Teddy Day), ఫిబ్రవరి 11న ప్రామిస్ డే(Promise Day), ఫిబ్రవరి 12 హగ్ డే, ఫిబ్రవరి 13 వ తేదీన కిస్ డే(kiss day),
ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే(Valentine's Day) సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే మీ ప్రేమికులకు ఎలాంటి బహుమతులు ఇచ్చి ప్రపోజ్ చేస్తే.. హ్యాపీగా ఫీల్ అవుతారు..? మీ ప్రేమకు వెంటనే గ్రీన్ సిగ్నల్ వస్తుంది.? అనే దానిపై తాజాగా నిపుణులు వెల్లడించారు. మీ భాగస్వామికి మీ లవ్ ను వ్యక్తపరచడానికి, మనసులోని ప్రేమను తెలుపడానికి గులాబీలు ఇవ్వండి. రోజ్ ఫ్లవర్ ఒక మంచి బహుమతి. ఈ ఫ్లవర్స్ ను ప్రేమకు చిహ్నంగా చెప్పుకుంటారు. కాగా గులాబీల సువాసన మీ లవ్ ను మరింత బలంగా చేయడంలో మేలు చేస్తుంది.
అలాగే మీ ప్రేమను తెలిపేందుకు గులాబీల బొకేను ఇవ్వండి. వీటితో పాటుగా తెల్ల గులాబీలు ఇవ్వండి. తెల్ల రోజ్ ఫ్లవర్స్ అమాయకత్వం, స్వచ్ఛత, శాంతి, కండీషన్లు లేని ప్రేమ, నిజాయితీని సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే పింక్ గులాబీలు() స్నేహం, సున్నితత్వం, వినయం, కృతజ్జత, కొత్త బంధానికి నాంది పలకడం. నారింజ గులాబీ.. అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. వీటితో పాటుగా ప్రేమ లేఖ కూడా రాయండి. ఆకట్టుకునే కోటేషన్స్ జోడించి లవ్ లెటర్ మీ భాగస్వామికి ఇవ్వండి. అలాగే అందమైన ప్రదేశానికి తీసుకెళ్లి ప్రపోజ్ చేయండి. అది మీ పార్ట్నర్‌కు ఎప్పుడు గుర్తుండిపోతుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సం ప్రదించగలరు.