చినుకు కురవలే.. విత్తనం మొలవలె.. కుండపోతైన మహిళలు

by Disha Web Desk 2 |
చినుకు కురవలే.. విత్తనం మొలవలె.. కుండపోతైన మహిళలు
X

దిశ, ఊట్కూర్ : మండలంలో ఇప్పటి వరకు సరైనా వర్షాలు కురవక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలకరి జల్లులకు ఇప్పటికే పత్తి గింజలు పెట్టిన రైతులు చినుకు జాడ కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. పెట్టిన గింజలు మొలకెత్తక పోవడంతో గురువారం పలు గ్రామాల్లో రైతులు ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా నీళ్లు తెచ్చి పత్తి చెట్లను రక్షించుకోవడానికి తిప్పలు పడుతున్నారు. వర్షాలు కురవకపోవడం, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మొలకెత్తిన కొద్దిపాటి విత్తనాలు కూడా ఎండిపోతున్నాయి. కళ్లెదుటే మొక్కలు ఎండిపోతుండడంతో తట్టుకోలేక అన్నదాతలు వాటిని రక్షించేందుకు తీవ్రపాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో సమిస్తాపూర్ గ్రామ శివారులో మహిళ రైతులు మొలకెత్తిన విత్తనాలకు నీళ్లు పోస్తు దిశ కెమెరాకు చిక్కారు.





Next Story

Most Viewed