ఏపీ ప్రజలకు ప్రధాని సర్‌ప్రైజ్.. భీమవరంలో పాటపాడిన మోడీ

by Disha Web |
ఏపీ ప్రజలకు ప్రధాని సర్‌ప్రైజ్.. భీమవరంలో పాటపాడిన మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: భీమవరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అనంతరం అల్లూరి కుటుంబ సభ్యులను ప్రధాని సన్మానించారు. ఈ సందర్భంగా పెదఅమీరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ముందుగా ''తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా'' అంటూ ప్రధాని తెలుగులో ప్రసంగం ప్రారంభించి, తెలుగులోనే ప్రధాని అల్లూరిని కొనియాడటం అందరినీ ఆశ్చార్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. మన్యం వీరుడు, తెలుగుజాతి యుగపురుషుడు అల్లూరి అని వ్యాఖ్యానించారు. అల్లూరి పోరాటానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed