రైతుల కోసం 'ఈ-రైతు యాప్'.. ఆ విషయాలన్ని అక్కడ తెలుసుకోవచ్చు!

by Disha Web Desk 19 |
రైతుల కోసం ఈ-రైతు యాప్.. ఆ విషయాలన్ని అక్కడ తెలుసుకోవచ్చు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ఉచితంగా పంటల యాజమాన్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంట కొనుగోలు సమాచారం కోసం ప్రతిమ గ్రూప్ 'ఈ-రైతు యాప్' రూపొందించింది. ఈ యాప్‌ను ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం వైస్ ఛాన్సలర్ ప్రొ. వీ. ప్రవీణ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది రైతులకు ఎప్పటికప్పుడు సలహాలను ఇవ్వాల్సి ఉందన్నారు. అందుకు ప్రతిమ గ్రూప్ ముందుకు రావడం అభినందనీయమన్నారు.

ప్రతిమ గ్రూప్ ఈ-రైతు డైరెక్టర్లు బోయినపల్లి ప్రణయ్, డా. అనుజ్ కొల్లి మాట్లాడుతూ.. ఈ-రైతు యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని రైతులు అన్ని రకాల సూచనలు, సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చన్నారు. రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో తమ బ్రాంచీల ద్వారా రైతులకు సహకారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈ-రైతు సీఈఓ రమణారావు వర్దినేని, టీమ్ సభ్యులు పాతూరి ప్రవీణ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed