- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీమిండియా టీ20 జట్టులో మార్పు.. సిరాజ్ సిరాజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణ
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల నుంచి మహమ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిధ్ కృష్ణను బీసీసీఐ ఎంపిక చేసింది.

దిశ, వెబ్ డెస్క్: రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత టీ20 జట్లలో బీసీసీఐ (BCCI) ఒక కీలక మార్పు చేసింది. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ఈ రెండు టీ20 సిరీస్‌ల నుంచి తప్పుకున్నాడు. రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, సిరాజ్ వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అతనికి ఈ రెస్ట్ ఇచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రసిధ్ కృష్ణకు చాన్స్..
సిరాజ్ స్థానంలో మరో పేసర్ ప్రసిధ్ కృష్ణను సెలెక్షన్ కమిటీ రెండు టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసింది. ఈ పర్యటనలో భారత జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు వహించనున్నాడు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లతో కూడిన అప్‌డేటెడ్ జట్టును బీసీసీఐ అధికారికంగా విడుదల చేసింది.
భారత అప్‌డేటెడ్ టీ20 జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిధ్ కృష్ణ.






