త్వరలో పవర్‌ఫుల్ Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
త్వరలో పవర్‌ఫుల్ Xiaomi 12 Pro 5G స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Xiaomi నుంచి శక్తివంతమైన మోడల్ 12 Pro 5G త్వరలో ఇండియాలోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇంతకుముందు ఈ ఫోన్ డిసెంబర్ 2021లో చైనాలో ప్రారంభమైంది. ఇది Qualcomm ప్రస్తుత ఫ్లాగ్‌షిప్, Snapdragon 8 Gen 1 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
XIAOMI 12 ప్రో 5G స్పెసిఫికేషన్‌లు(అంచనా)..

* 6.73-అంగుళాల WQHD+ AMOLED డిస్‌ప్లేతో LTPO టెక్నాలజీతో, 1500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

* మంచి డిస్‌ప్లే అనుభవం కోసం డాల్బీ విజన్‌కు సపోర్ట్ ఇస్తోంది.

* గరిష్టంగా 12GB RAM 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

* ఫోన్ ఆండ్రాయిడ్ 12-ఆధారిత MIUI 13 తో రన్ అవుతుంది.

* ఫోన్ వెనుకవైపు, మూడు 50MP+50MP+50MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

* ఫోన్ 4,600mAh బ్యాటరీని కలిగి ఉంది. 120W Xiaomi హైపర్‌ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ చార్జింగ్, 10W రివర్స్ చార్జింగ్‌ సదుపాయం ఉంది.

* ఇండియాలో స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర(అంచనా) రూ. 76,300.


Next Story

Most Viewed