తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కట్.!

by Disha Web |
తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కట్.!
X

దిశ, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. గత రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ధరణి సేవలు భూమి క్రయ, విక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులు విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనెక్షన్ తొలగించిన రోజు 19 రిజిస్ట్రేషన్లను బ్యాటరీలు సాయంతో నడపగా శుక్రవారం మరో 9 దరఖాస్తులు వచ్చాయి.

అవి పూర్తిగా అలాగే ఉండడంతో రైతులు నిరాశతో వేణుదిరిగిపోయారు. సుమారు ఆరు నెలలుగా 60వేలు విద్యుత్ బిల్లు పేరుకుపోయిందని వాటిని పూర్తిగా చెల్లిస్తేనే పునరుద్దరిస్తామని విద్యుత్ సరఫరా తొలగించారు. కానీ ప్రస్తుతం 20వేలు మాత్రమే పెండింగ్ ఉందని అయినా కనెక్షన్ తొలగించారని డిప్యూటీ తహశీల్దార్ ఖాజా మైనోద్దీన్ తెలిపారు. దీంతో ధరణి సేవలతో పాటు జిల్లా అంతటా ఆయా శాఖల అధికారులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కూడా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా అధిక బకాయిలు ఉన్న ఏ కార్యాలయానికైనా సరఫరా నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు విద్యుత్ అధికారులు చెబుతున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed