పేకాట స్థావరం పై పోలీసుల దాడి

by Batti.Sumithra |

మండలంలోని కిష్టాపూర్ గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో సోమవారం రాత్రి డబ్బులను పందెంగా పెట్టి మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు.

పేకాట స్థావరం పై పోలీసుల దాడి
X

దిశ, జన్నారం : మండలంలోని కిష్టాపూర్ గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో సోమవారం రాత్రి డబ్బులను పందెంగా పెట్టి మూడు ముక్కలాట (పేకాట) ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురిని అరెస్ట్ చేసినట్టు జన్నారం ఎస్సై జి. ఉదయ్ కిరణ్ తెలిపారు. కిష్టాపూర్ గ్రామ శివారులో కొంత మంది పేకాట ఆడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బందితో మామిడి తోట వద్ద దాడి చేయగా సంఘటనా స్థలంలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన వాసాల రవి (40), గోనె మురళి (45), కోల రాజేష్ (42), భూక్య రాజు (45)లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. నలుగురు వ్యక్తులు సురమల్ల ప్రకాష్, పోతుగంటి వెంకటేష్, చింతల రాజకుమార్, గంధం విజయరావు పోలీసులను గమనించి పరారయ్యారని తెలిపారు. అరెస్టు చేసిన నిందితుల వద్ద నుంచి రూ.7,040 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Next Story