'జై మహాభారత్' పార్టీ వ్యవస్థాపకుడిపై కేసు..

by Disha Web Desk 12 |
జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపకుడిపై కేసు..
X

దిశ, సిటీ బ్యూరో: తమ పార్టీలో కేవలం రూ. 10 చెల్లించి సభ్యత్వం తీసుకుంటే త్వరలోనే 200 చదరపు గజాల స్థలాలిస్తామంటూ ప్రచారం చేసుకుంటూ, భారీగా సభ్యత్వాలు నమోదు చేసుకున్న జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపకుడు ఫేక్ బాబా భగవాన్ అనంత విష్ణు ప్రభు అలియాస్‌ రామ్ దాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. భారత ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీకి ఇచ్చిన ఆదేశాల మేరకు రాందాస్ పై పబ్లిక్ న్యూ సెన్స్, చీటింగ్, రాకపోకలకు అంతరాయం కల్గించినందుకు ఐపీసీ సెక్షన్లు 420, 290, 341,506 కింద కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ కోసం ఈసీకి లేఖ రాసినట్లు సమాచారం. ఉచితంగా 200 గజాల ఇళ్ల స్థలాల పేరిట రూ. 5లక్షల ఆధార్ కార్డుల కాపీల సేకరణ వంటి అభియోగాలపై ఫిర్యాదులు రావటంతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మున్ముందు మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశమున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.


Next Story

Most Viewed