గళ్ ఫ్రెండ్ కాల్ చేసిందని వెళ్లిన యువకుడు.. సీన్ కట్ చేస్తే దారుణ హత్య..

by Disha Web Desk 19 |
గళ్ ఫ్రెండ్ కాల్ చేసిందని వెళ్లిన యువకుడు.. సీన్ కట్ చేస్తే దారుణ హత్య..
X

దిశ, వెబ్‌డెస్క్: పుణేలో దారుణం జరిగింది. లవర్ పిలిచిందని వెళ్లిన ఓ యువకుడు దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ హత్య కేసులో పుణే పోలీసులు 19 ఏళ్ల యువతిని అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ప్రధుణ్య కాంబ్లే అనే యువకుడు పుణేలో నివాసం ఉంటున్నాడు. ఇతడు ఓ యువతిని ప్రేమించాడు. అయితే ప్రధుణ్య ఇటివల దారుణ హత్యకు గురయ్యాడు. దీనితో రంగలోకి దిగిన పోలీసులు ఇతడి ప్రేయసిపై అనుమానం రావడంతో విచారణ చేయగా.. ఇతడి హత్య కుట్రలో ఆమె ప్రమేయం ఉన్నట్లు తేలిందని పోలీసులు తెలిపారు. ప్రధుణ్య హత్య చేయబడిన ప్రదేశానికి రావాలని ముందుగా ఇతడి ప్రేయసే ఫోన్ చేసి పిలిచిందని పోలీసులు వెల్లడించారు. ఆ ప్రదేశానికి వచ్చిన అనంతరం యువతి కుటుంబ సభ్యులే యువకుడిని హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.



Next Story