డ్రగ్స్‌ నిర్మూలనపై పోలీసుల ఫోకస్.. సైబరాబాద్ సీపీ ట్వీట్ వైరల్

by Disha Web Desk 2 |
డ్రగ్స్‌ నిర్మూలనపై పోలీసుల ఫోకస్.. సైబరాబాద్ సీపీ ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి వాడకం, అమ్మకం దారులపై కఠినంగా వ్యహరించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సినీ ప్రముఖులను సైతం వదిలేది లేదంటూ సీఎం కేసీఆర్ సీరియస్ అయిన క్రమంలో డ్రగ్స్ నిర్మూలనలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరిస్తూ దాడులు నిర్వహిస్తున్నారు. అయితే, రానున్న హోలీ పండుగ నేపథ్యంలో డ్రగ్స్, గంజాయి వినియోగించే అవకాశం ఉన్నందున పోలీసు శాఖ అప్రమత్తమత్తమైంది. ఇప్పటికే వైన్సులు, బార్లను మూసివేసేందుకు నిర్ణయించింది. అయితే, హోళీ ఈవెంట్స్‌లో డ్రగ్స్ వినియోగం జరిగే అవకాశం ఉన్నందున యువతను అప్రమత్తం చేస్తూ పోలీసు శాఖ సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. ''డ్రగ్స్ ఆరోగ్యాన్ని ఆగం చేస్తాయి. అనర్థాలకు దారి తీస్తాయి. భవిష్యత్తులో నిప్పులు పోస్తాయి. అనుబంధాలను దూరం చేస్తాయి. డ్రగ్స్‌కు దూరంగా ఉండండి. ఎవరైనా వాడుతున్నట్లు తెలిసినా, డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వండి.'' అంటూ సైబరాబాద్ సీపీ ట్వీట్ చేశారు.

Next Story