వన్యప్రాణులు జాతీయ సంపదే.. ర్యాలీ నిర్వహించిన అధికారులు

by Web Desk |
వన్యప్రాణులు జాతీయ సంపదే.. ర్యాలీ నిర్వహించిన అధికారులు
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవులు, వన్యప్రాణుల పరిరక్షణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ క్షేత్రాధికారి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ.. అడవుల్లోని వన్యప్రాణులూ జాతీయ సంపదే కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. వన్యప్రాణులను వేటాడటం, కరెంట్ తీగలతో ఉచ్చులు అమర్చడం, అడవులకు నిప్పు పెట్టడం, అటవీ సంపద నాశనం చేయడం వంటివి చట్టరీత్యా శిక్షార్హమని అవగాహన పెంచుతూ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు.

Next Story