- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిందాలో పోడు పోరు.. అటవీ అధికారులు, రైతుల మధ్య తోపులాట
by Jakkula.Mamatha |
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల వివాదం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది

X
దిశ,కాగజ్ నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామంలో పోడు భూముల వివాదం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అటవీ భూముల సంరక్షణలో భాగంగా మొక్కలు నాటేందుకు వచ్చిన అధికారులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు కందకాలు తవ్వి, సరిహద్దులు ఏర్పాటు చేస్తుండగా ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు భగ్గుమన్నారు. మేము తాతల కాలం నుంచి ఈ భూములను నమ్ముకునే బతుకుతున్నాం. మా పొట్ట కొట్టకుండా సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి అని పోడుదారులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా అటవీ శాఖ సిబ్బంది మోహరించారు. కొందరు రైతులు అధికారుల వాహనాలకు అడ్డుగా పడుకుని నిరసన తెలపడంతో, వారిని సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Next Story






