భారత్‌కు రావాలని యూఏఈ అధ్యక్షుడికి మోడీ ఆహ్వానం

by Dishafeatures2 |
భారత్‌కు రావాలని యూఏఈ అధ్యక్షుడికి మోడీ ఆహ్వానం
X

అబుదాబీ: జీ7 సదస్సు సమావేశం తర్వాత జర్మనీ నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ యూఏఈ చేరుకున్నారు. మంగళవారం యూఏఈ నూతన అధ్యక్షుడు, పాలకుడు అబుదాబీ షేక్ మహ్మద్ బిన్ జయెద్ అల్ నహ్యన్‌తో సమావేశమయ్యారు. భారతదేశం-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా, వైవిధ్యంగా కొనసాగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయెద్ అల్ నహ్యన్‌కు నివాళులు ఆర్పించారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. షేక్ ఖలీఫా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మోడీ.. ఆయనను గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడని అభివర్ణించారని తెలిపారు.


అంతకుముందు ప్రధాని మోడీకి షేక్ మహ్మద్ తన రాయల్ కుటుంబానికి సీనియర్ సభ్యులతో అబుదాబీ ఎయిర్ పోర్టులో ప్రధానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. 'అబుదాబి విమానాశ్రయంలో నన్ను స్వాగతించడానికి వచ్చిన నా సోదరుడు నెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రత్యేక ఆహ్వానం నన్ను తాకింది. ఆయనకు నా కృతజ్ఞతలు' అని అరబిక్ భాషలో పేర్కొన్నారు. షేక్ మహ్మద్‌ను త్వరలోనే భారత్‌లో పర్యటించాలని ఆయన ఆహ్వానించారు. షేక్ ఖలీఫా మరణించిన రోజున భారతదేశం ఒక రోజు సంతాప దినం ప్రకటించింది. 2019-20 తర్వాత యూఏఈ భారత్‌కు చైనా, యూఎస్‌ల తర్వాత మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇరు దేశాల మధ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 72 బిలియన్లు యూఎస్ డాలర్లుగా కావడం గమనార్హం.



Next Story

Most Viewed