పూణే మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ

by Disha Web |
పూణే మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోడీ
X

ముంబై: పూణే ప్రతిష్టాత్మక మెట్రో ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. గర్వారే స్టేషన్ నుంచి ఆయన మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. 32.2 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో తొలి విడతలో 12 కిలోమీటర్ల మెట్రోను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన స్వయంగా టికెట్ తీసుకుని మెట్రో ఎక్కారు. గర్వారే స్టేషన్‌ నుంచి ఆనంద్‌నగర్‌ స్టేషన్‌ వరకు 5 కిలోమీటర్ల దూరం మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రో ప్రయాణంలో పిల్లలతో సంభాషించారు. దివ్యాంగ విద్యార్థులతోనూ ఆయన ముచ్చటించారు. రూ.11,400 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ 2016లో శంకుస్థాపన చేశారు.

వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే పూణేలో 150 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రధాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బస్సుల ఛార్జింగ్ కోసం అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. తాజాగా ప్రారంభించిన బస్సులతో కలిపి పూణేలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 250కు చేరింది. అంతకుముందు పూణే మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేశారు. దీంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మోడీ ప్రారంభించారు.



Next Story

Most Viewed