ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని అర్థం చేసుకోలేదు : రాహుల్ గాంధీ

by Disha Web |
ఉపాధిహామీ పథకాన్ని ప్రధాని అర్థం చేసుకోలేదు : రాహుల్ గాంధీ
X

తిరువనంతపురం: మహత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోడీ పూర్తిగా అర్థం చేసుకోలేదని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన కేరళలోని తన నియోజకవర్గం వయనాడ్ లో మీడియాతో మాట్లాడారు. 'ప్రధాని మోడీ వ్యాఖ్యలు తనను షాక్ కు గురిచేయాలని చెప్పారు. లోక్‌సభలో ప్రధాని మోడీ ఉపాధి హామీ పథకంపై మాట్లాడుతున్నపుడు నేను షాక్ అయ్యాను. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలలో సజీవ శిలగా దీనిని వర్ణించారు.

ఖజానాకు గండి పడుతుందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఆ పథకంపై ఎలాంటి అవగాహాన లేదని నాకు అర్థం అయింది' అని చెప్పారు. దేశంలోని లక్షలాది ప్రజలకు ఉపాధి హామీ చివరి అస్త్రమని, భారీ రక్షణ అని ప్రధాని అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. భారతీయ కార్మిక మార్కెట్ లో ఉపాధిహామీ శాశ్వత మార్పులు తీసుకొచ్చిందనే విషయం ప్రధానికి అర్థం కాదని అన్నారు. 2015లో లోక్ సభలో ఉపాధి హామీ పథకంపై ప్రధాని మోడీ మాట్లాడారు. పథకాన్ని యూపీఏ వైఫల్య చిహ్నాంగా వర్ణించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed