ఆ దాడికి ప్రతికారం తీర్చుకుంటాం: పిడమర్తి రవి వార్నింగ్

by Disha Web |
ఆ దాడికి ప్రతికారం తీర్చుకుంటాం: పిడమర్తి రవి వార్నింగ్
X

దిశ, సికింద్రాబాద్: బీజేపి బహిరంగ సభలో మాదిగలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్‌ఎఫ్ఓయూ అధ్యక్షుడు బూరెలు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల అలయ్ బలయ్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పిడమర్తి రవి ముఖ్యాతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో మాదిగల అభివృద్ధి ఓర్వలేని పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. మాదిగలపై జరిగిన దాడికి కౌంటర్‌గా ప్రతి దాడి చేసే దమ్ము, ధైర్యం మాదిగలకు ఉందన్నారు.

వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీకి మాదిగ సమాజం మొత్తం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఓటు చైతన్యం ద్వారానే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలిపారు. ఈనెల 10 జరిగే మాదిగల అలయ్ బలయ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని మాదిగ మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాప్రతినిధులు అన్ని పార్టీల నుంచి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీ ఎంఅర్పీ‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ, టీ ఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య మాదిగ, మహా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్యపాక నరసింహారావు, మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వడ్డె ఎల్లయ్య, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రామగల సుందర్ తదితరులు పాల్గొన్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed