ఈ దశాబ్దపు గ్రేటెస్ట్ టెక్ ఇన్వెన్షన్‌గా 'మస్కిటో బ్యాట్'

by Disha Web Desk 17 |
ఈ దశాబ్దపు గ్రేటెస్ట్ టెక్ ఇన్వెన్షన్‌గా మస్కిటో బ్యాట్
X

దిశ, ఫీచర్స్: దోమల బారి నుంచి తప్పించుకోవడం మనుషులకు ఎప్పుడూ సవాలే. మస్కిటో కాయిల్స్‌ నుంచి రిపెల్లెంట్స్ వరకు ఎన్నో పరిష్కారాలున్నా.. 'ఎలక్ట్రిక్ మస్కిటో రాకెట్‌' ఒక్కటే పవర్‌ఫుల్‌ వెపన్‌గా ప్రశంసలు అందుకుంటోంది. తైవానీస్ ఇన్వెంటర్ 'త్సావో-ఐ షిహ్'.. 1996లో ఈ పరికరాన్ని 'ఎలక్ట్రానిక్ ఇన్‌సెక్ట్ కిల్లర్ స్వాటర్' పేరుతో ఆవిష్కరించాడు. ఆ సాంకేతికతతో తయారైన బ్యాట్లను ప్రస్తుతం రూ. 200కే కొనుగోలు చేస్తున్నాం. ఈ క్రమంలోనే ఇండియన్ యాక్టర్, మోడల్ కునాల్ కపూర్ తాను వాడుతున్న హిట్ కంపెనీ మస్కిటో రాకెట్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ 'గత దశాబ్దపు గొప్ప సాంకేతిక ఆవిష్కరణల్లో ఇది ఒకటి' అని ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్ల మధ్య చర్చకు దారితీయగా.. రకరకాల ఎలక్ట్రిక్ రాకెట్స్ ఫొటోలు షేర్ చేస్తూ దోమలను చంపడంలో వాటి గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు.



Next Story

Most Viewed