ఏళ్లు గడుస్తున్న ఎదురుచూపులే.. ఇకనైనా మిషన్ భగీరథ వారి దాహం తీర్చేనా..?

by Disha Web Desk 19 |
ఏళ్లు గడుస్తున్న ఎదురుచూపులే.. ఇకనైనా మిషన్ భగీరథ వారి దాహం తీర్చేనా..?
X

దిశ, మేళ్లచెరువు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు నీరు అందించాలని ఉద్దేశంతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం మేళ్లచెరువు మండలంలో మాత్రం ఇంకా అమలు కాకపోవడంతో ప్రజలు తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలో మిషన్ భగీరథ నీటి కోసం పైపులైన్లు, ట్యాంకులు నిర్మాణం చేపట్టి చాలా ఏళ్లు గడుస్తున్నా.. పైపులైన్లుకు అక్కడ అక్కడ లీకేజీలు కావడంతో ఇంతవరకు మండలంలోని రెండు గ్రామాలకు తప్పా, మిగతా గ్రామాలకు భగీరథ నీరు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం ప్రజా అవసరాల కోసం బోర్ నీటినే ఉపయోగిస్తున్నామని సర్పంచ్లు చెబుతున్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ పేరుతో పైపులైన్లు వేసేందుకు సీసీ రోడ్లును ధ్వంసం చేశారు. వాటిని ఇంతవరకు పునరుద్ధించలేదు. దీని కారణంగా ఆ రోడ్లపై ప్రయాణించేందుకు స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలకు నిధులు లేక ప్రజలకు అవసరమైన నీటిని తమ సొంత ఖర్చులతో అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు లబోదిబోమంటున్నారు. కొన్ని ప్రాంతంలో నీటి బోర్లు 200 నుండి 300 అడుగుల వరకు పోయినా నీరు సరిపడా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్నది ఎండాకాలం కనుక నీటి కొరత రాకుండా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story