ద్రవ్యోల్బణ ప్రభావం: ఆ ఆహారం వ‌ద్దంటున్న‌ ఈ జంతువులు..?!

by Disha Web Desk 20 |
ద్రవ్యోల్బణ ప్రభావం: ఆ ఆహారం వ‌ద్దంటున్న‌ ఈ జంతువులు..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సెంట్రల్ జపాన్‌లోని కనగావా ప్రాంతంలో ఉన్న‌ హకోన్-ఎన్ అక్వేరియం చాలా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అధికారులు చెబుతున్న వివ‌రాల‌ను బ‌ట్టి సాధార‌ణంగా అక్వేరియంలోని పెంగ్విన్‌లు, ఓటర్‌లు భోజనాన్ని చాలా ఇష్టపడతాయని, అయితే, ప్ర‌స్తుతం దేశంలో ముంచుకొస్తున్న ద్ర‌వ్యోల్బ‌ణం కార‌ణంగా ఈ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింద‌ని అంటున్నారు. దేశంలో ధ‌ర‌ల పెరుగుద‌ల త‌ర్వాత జపనీస్ అక్వేరియంలోని ఈ జంతువులు సంర‌క్ష‌కులు కొత్తగా అందిస్తున్న చౌక ర‌క‌మైన‌ ఆహారాన్ని తినడానికి నిరాకరిస్తున్నాయ‌ని చెప్పారు. ఈ ఉదాహ‌ర‌ణ‌తో ఆ దేశంలో ద్రవ్యోల్బణం పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అక్వేరియం హెడ్ హిరోకి షిమామోటో వార్తా సంస్థ AFPతో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ధరలు తగ్గే వరకు ప్ర‌స్తుత ప‌రిస్థితి కొన‌సాగుతుంద‌ని, వేరే మార్గం లేద‌ని ఆయ‌న తెలిపారు.


Next Story

Most Viewed