- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం.. కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుడు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్లాట్‌ఫాం నం.8 వద్ద జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి రైలు కిందకు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ అజాద్ అన్సారీ(31)గా రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రయాణం కోసం రైలును ఎక్కే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం లేదా దిగడం ప్రమాదకరమని, ప్రయాణికులు భద్రత నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.






