ప్రముఖ క్రికెటర్‌ను వేధిస్తున్న మోచేయి గాయం.. గతంలోనూ..

by S Gopi |
ప్రముఖ క్రికెటర్‌ను వేధిస్తున్న మోచేయి గాయం.. గతంలోనూ..
X

ఇస్లామాబాద్: ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పాకిస్థాన్‌తో జరిగే మూడు వన్డేలు, ఏకైక టీ20కి దూరమయ్యాడు. ఎడమ మోచేయి గాయం కారణంగా టీమ్ ఫిజియోథెరపిస్ట్ అలెక్స్ కౌంటౌరిస్ సూచన మేరకు స్మిత్ విశ్రాంతి తీసుకునేందుకు నిర్ణయించుకున్నాడు. గతంలోనూ పాక్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టీవ్ స్మిత్ గాయం బారిన పడ్డాడు. కాగా, 32 ఏళ్ల క్రికెటర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ మిచెల్ స్వెప్సన్‌ను ఆసిస్ జట్టులోకి తీసుకోనుంది.



Next Story

Most Viewed