పగిడిద్దరాజు జాతర ప్రారంభం.. భారీ బందోబస్తు చేసిన పోలీసులు

by Web Desk |
పగిడిద్దరాజు జాతర ప్రారంభం.. భారీ బందోబస్తు చేసిన పోలీసులు
X

దిశ, గుండాల: గుండాల మండలం యపాల గడ్డ గ్రామంలో పగిడిద్దరాజు జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు అతని స్వగ్రామమైన యాప్ గ్రామంలో రామ వంశీకులు ప్రతిఏడాది ఫిబ్రవరి మార్చి మాసంలో ఘనంగా జాతర నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతరలో గుండాల కరకగూడెం, ఆళ్ల పల్లి, కరకగూడెం, తాడువాయి, గంగారం, ఇల్లందు పినపాక టేకులపల్లి మండలాల నుండి భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు.

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ అన్నారు. అంతేకాకుండా ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్యుత్ అధికారులు యాత్ర పనుల్లో నిమగ్నమై పనులు నిర్వహించారు. జాతర పనులను తాహసీల్దార్ రమేష్ ఎంపీడీవో హజరత్ అలీ పర్యవేక్షణలో జాతరలో ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed