- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
మురళి యాదవ్‌పై పద్మా దేవందర్ రెడ్డి ఫైర్.. పార్టీ నుంచి సస్పెన్షన్

దిశ, మెదక్ : ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ అద్యక్షుడు, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. శనివారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ పార్టీ చర్యలకు వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదన్నారు. తన మనసులో వేరే ఆలోచనతోనే మురళి యాదవ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడని తెలిపారు. పార్టీ మురళి యాదవ్‌కు సముచిత స్థానం కల్పించిందనీ, తన భార్యకు ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్, తనకు మున్సిపల్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కట్టబెట్టిందని తెలిపారు. ఎవరిని సంప్రదించకుండా మాట్లాడటం సరికాదన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలు మీడియా సమావేశంలో చెప్పడం సరికాదని, అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సమావేశం మున్సిపల్ చైర్మన్ చంద్ర పాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, గంగాధర్ రాగి అశోక్, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.