'కమలం'లో ఆపరేషన్ ఆకర్ష్ షురూ... ఈటలకు కీలక బాధ్యతలు

by Disha Web Desk |
కమలంలో ఆపరేషన్ ఆకర్ష్ షురూ... ఈటలకు కీలక బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : జాతీయ కార్యవర్గ సమావేశాలు, మోడీ భారీ బహిరంగ సభ అనంతరం బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్​పై దృష్టిసారిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీలో ఆశించిన స్థాయిలో చేరికలు లేవని హైకమాండ్​ మొట్టికాయలు వేసిన నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఆపరేషన్ ఆకర్ష్​పై ఫోకస్ చేస్తున్నారు. ఈ బాధ్యతలను హుజురాబాద్​ఎమ్మెల్యే ఈటలకు ఇస్తే చేరికలు ఎక్కువగా ఉంటాయని పార్టీ భావిస్తోంది. ఉద్యమకారుడిగా ఆయనకున్న చరిష్మా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద ఈటలకు పట్టుంది. ఉద్యమకారుల్లో ఆయనకు ఎంతో పేరుంది. అందుకే ఆయనైతే ఈ పదవికి న్యాయం చేయగలడని పార్టీ విశ్వసిస్తోంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్ గా సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన తనకీ పదవి వద్దని ఆది నుంచి రాష్ట్ర నాయకత్వానికి చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకే చేరికలపై కూడా ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడంలేదని టాక్. నల్లు ఇంద్రసేనారెడ్డి స్వయంగా తానే తనను ఈ బాధ్యతల నుంచి తప్పించి మరొకరికి ఇస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం. అందుకే ఈటల వైపు పార్టీ మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా జాయినింగ్స్ కమిటీ కో చైర్మన్ గా వివేక్ వెంకట స్వామికి అప్పగించాలని యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ప్రధాని మోడీ, నడ్డా, అమిత్ షా సమక్షంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా దూకుడును మరింత పెంచి భారీ స్థాయిలో నేతలను బీజేపీలోకి చేర్చుకునేలా కమలనాథులు శ్రీకారం చుట్టారు.


Next Story

Most Viewed