వావ్ అనిపించే ఫీచర్స్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ OnePlus 10T 5G లాంచ్

by Disha Web Desk 17 |
వావ్ అనిపించే ఫీచర్స్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ OnePlus 10T 5G లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కొత్త మోడల్ 10T 5Gని ఇండియాలో లాంచ్ చేసింది. అదిరిపోయే ఫీచర్స్‌తో ఫోన్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ పేర్కొంది. 150W SuperVOOC ఎండ్యురెన్స్ ఎడిషన్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ టెక్నాలజీతో ఈ మొబైల్ వస్తోంది. బ్యాటరీ 0 నుంచి 100 శాతం 19 నిమిషాల్లోనే చార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ. 49,999. 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.54,999, 16జీబీ + 256జీబీ స్టోరేజ్ టాప్‌ వేరియంట్ ధర రూ.55,999.


ఈ-కామర్స్ సైట్ అమెజాన్, వన్‌ప్లస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ ప్రీఆర్డర్స్ మొదలయ్యాయి. ఈనెల 6వ తేదీన అమ్మకానికి వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్‌తో అమెజాన్‌లో రూ.5,000 డిస్కౌంట్ లభిస్తుంది. ప్రీ-ఆర్డర్ ద్వారా మరో రూ.1,000 అదనంగా తగ్గింపు లభిస్తుంది. అదే వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై రూ.5,000 తక్షణ డిస్కౌంట్ ఉంది.

OnePlus 10T 5G స్పెసిఫికేషన్లు

* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లుయిడ్ AMOLED డిస్‌ప్లే.

* 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.

* Android 12, OxygenOS 12.1 పై రన్ అవుతుంది.

* క్వాల్‌కామ్‌ పవర్‌ఫుల్‌ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది.

* ప్రత్యేకంగా 3D కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు.

* ఫోన్ బ్యాక్ సైడ్ 50 MP + 8 MP + 2 MP మూడు కెమెరాలు ఉన్నాయి.

* సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

* 150W సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీని అందిస్తోంది.

* కేవలం 0 నుంచి 100 శాతం బ్యాటరీ చార్జ్ 19 నిమిషాల్లోనే పూర్తవుతుందని కంపెనీ పేర్కొంది.

* డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Next Story