- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి
లకంపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారి పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, నేరడిగొండ : మండలంలోని లకంపూర్ సమీపంలో 44వ జాతీయ రహదారి పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం నేరడిగొండ నుండి ఇచ్చోడ వైపు ఆటో వెళ్తుంది. ఈ క్రమంలోనే లకంపూర్ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన ఒక గుర్తు తెలియని వాహనం ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మాడవి శేఖ్ రావు (35) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాగా కుమారి గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ దేవిదాస్ (60) తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని తక్షణమే చికిత్స నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దేవిదాస్ పరిస్థితి విషమంగా ఉండటం, సిటీ స్కాన్ చేయించాల్సి రావడంతో బోథ్ వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోథ్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదం పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు నేరడిగొండ ఎస్సై ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.






