అత్తగారి ఊరు వెళ్లి.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి

by Web Desk |
అత్తగారి ఊరు వెళ్లి.. చివరికి అలా మృత్యువు ఒడిలోకి
X

దిశ, రామాయంపేట: ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని ఫతేనగర్ కు చెందిన ఊడపల్లి నరేష్ (35) తన భార్య పిల్లలను చూడటానికి అత్తగారి ఊరు రామాయంపేట మండలం లక్ష్మాపూర్ కు శనివారం రాత్రి వచ్చాడు. ఆదివారం ఉదయం తన కుమారుడు నవదీప్ తో కలిసి నరేష్ కాలకృత్యాలు తీర్చుకోవడానికి లక్ష్మాపూర్ లోని చెరువు వద్దకు వచ్చాడు. నీళ్లలోకి దిగడంతో చెరువులోని గుంతలో పడి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. ఈ మేరకు మృతుని భార్య లక్ష్మీ రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story