కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఒక్కసారి చార్జింగ్‌తో 160 కి.మీ

by Disha Web Desk 17 |
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌.. ఒక్కసారి చార్జింగ్‌తో 160 కి.మీ
X

దిశ,వెబ్‌డెస్క్: Okinawa Autotech కొత్త Okhi 90 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కొత్త హై-స్పీడ్ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్‌తో 160 కి.మీ ల దూరం వెళ్ళవచ్చు. ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,21,866. Okhi 90 3.6kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 3800 వాట్ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఒక్కసారి బ్యాటరీ చార్జీంగ్‌తో గరిష్టంగా 90kmph వేగంతో 160 కి.మీ దూరం వెళ్ళవచ్చు. చార్జింగ్ సమయం పరంగా, Okhi 90 కేవలం ఒక గంటలో 80 శాతం వరకు చార్జ్ చేయగలదు. అయితే, పూర్తిగా చార్జ్ చేయడానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.

ఓఖీ 90 ఫీచర్లు

-ఆటోమేటిక్ కీ లాకింగ్ సిస్టం

-పార్కింగ్ మోడ్

-బ్యాటరీ వోల్టేజ్ సమాచారంతో స్పీడోమీటర్

-లగేజ్ బాక్స్ లైట్

-మొబైల్ చార్జింగ్ USB పోర్ట్

-GPS తో రియల్ టైమ్ అసెట్ ట్రాకింగ్

-దొంగతనం అలారం

-ఇగ్నిషన్ ఆన్/ఆఫ్ స్టేటస్

-వాహనం బ్యాటరీ చార్జ్ స్టేటస్

-ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లు

Next Story