అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : ఎంపీ చామల

by Batti.Sumithra |

జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలి : ఎంపీ చామల
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారుల పై ఉందన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే వివిధ శాఖల్లో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను సమర్థవంతంగా వినియోగించి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Next Story