వందేళ్ల నాటి శివాలయంలో క్షుద్ర పూజల కలకలం..

by Disha Web |
వందేళ్ల నాటి శివాలయంలో క్షుద్ర పూజల కలకలం..
X

దిశ, నిడమనూరు : గుప్త నిధుల కోసం క్షుద్ర పూజ చేసిన సంఘటన మండలంలోని మారుపాక గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మొగుళ్ల శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. మారుపాక గ్రామానికి చెందిన నందికొండ నాగలక్ష్మి వ్యవసాయ భూమిని వెంకటాపురం గ్రామానికి చెందిన బొంతల కోటయ్య గత మూడేళ్లుగా కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఈ నెల 4, 5 వ తేదీల్లో కోటయ్య తమ్ముడు బొంతల శశి కుమార్ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి అర్ధరాత్రి సమయంలో నందికొండ సాలమ్మ, నాగలక్ష్మి భూమిలో ఉన్న వందేళ్ల నాటి పురాతన శివాలయం లో క్షుద్ర పూజలు చేశారు. గుప్తనిధుల కోసం శివాలయాన్ని పూర్తిగా జేసీబీతో తవ్వి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గమనించిన నాగలక్ష్మి బుధవారం నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మొగుళ్ల శోభన్ బాబు తెలిపారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed