Noise Nerve Pro నెక్‌బ్యాండ్: 10 నిమిషాలతో 10 గంటల బ్యాటరీ లైఫ్

by Disha Web Desk 17 |
Noise Nerve Pro నెక్‌బ్యాండ్: 10 నిమిషాలతో 10 గంటల బ్యాటరీ లైఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో‌కి నెక్‌బ్యాండ్ తరహా కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ విడుదలచేయబడ్డాయి. కొత్త వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ 'నాయిస్ నెర్వ్ ప్రో'. ఇది వేగవంతమైన కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2 సాంకేతికతను కలిగి ఉంది. దీనిలో ప్రత్యేకంగా ఫాస్ట్‌చార్జింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. కేవలం 10 నిమిషాల చార్జింగ్‌తో 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఒక్కసారి పూర్తి చార్జింగ్ ద్వారా 35 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. నాయిస్ నెర్వ్ ప్రో ఇయర్‌ఫోన్‌లు 10 మీటర్ల వరకు వైర్‌లెస్ పరిధిని కలిగి ఉన్నాయి. వైర్‌లెస్ కనెక్టీవిటీ పరిధి నుంచి దూరం వెళ్ళిన ఫోన్ కాల్స్, పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. వినియోగదారులు ఈ ఇయర్‌ఫోన్‌లను ఒకేసారి రెండు డివైజ్‌లతో కనెక్ట్ చేయవచ్చు. ఫోన్ కాల్స్ కోసం మైక్రోఫోన్‌తో నాయిస్ నెర్వ్ ప్రో ఫీచర్ ఇన్-లైన్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్ సౌండ్ రిడక్షన్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులు బయట సౌండ్స్ నుంచి ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా కమ్యూనికేషన్ పొందుతారు. ఇది చెమట, నీటి నుండి కాపాడటానికి IPX5-రేటింగ్ ద్వారా వస్తుంది. వర్కౌట్‌లు, జాగింగ్‌కు అనువుగా ఉంటుంది. ఈ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లు ఇన్-ది-ఇయర్ డిజైన్‌తో మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లను కలిగి ఉంటాయి. Flipkartలో నాయిస్ నెర్వ్ ప్రో ధర రూ. 899. ఇది సియాన్ బ్లూ, జెట్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.



Next Story

Most Viewed