పడుకునే సమయంలో జుట్టును అలా వేసుకుంటే.. జీవితమంతా హ్యాపీనే..

by Dishanational2 |
పడుకునే సమయంలో జుట్టును అలా వేసుకుంటే.. జీవితమంతా హ్యాపీనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ మద్య కాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నకీలక సమస్య హేయిర్ లాస్. చిన్న పిల్లల నుండి పెద్దల వరుకు కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. హెయిర్ లాస్ అనేది అనేక రకాల ఆరోగ్య సమస్యలు, విపరీతంగా పెరుగుతున్న పొల్యూషన్ వల్ల కావచ్చు. అయితే చాలా మంది హెయిర్ లాస్ అవ్వకుండా ఉండటం కోసం రకరకాల షాంపులు వాడుతూ ఉంటారు. అయిన వాళ్లకి ఆశించిన ఫలితం దక్కక పోయే సరికి నిరాశ చెందుతారు. అయితే వైద్యనిపుణుల తెలిపిన సలహాల మేరకు రాత్రి పూట కొన్ని చిట్కాలను పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది అని చెబుతున్నారు.

అవి ఏంటో తెలుసుకుందాం..

మాయిశ్చరైజ్: తల స్నానం చేసే ముందు జుట్టుకు సీరమ్ రాయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత తేలికపాటి చేతులతో కాసేపు మసాజ్ చేస్తే చాలా మంచిది.

సాయంత్రం తలస్నానం: సాయంత్రం తలస్నానం చేస్తే రిలాక్స్‌గా ఉంటుంది. అయితే కండీషనర్ వాడటం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.

జుట్టును ఆరనివ్వండి: సాయంత్రం తలస్నానం చేస్తే జుట్టుని కచ్చితంగా ఆరనివ్వాలి. తడి జుట్టుతో పడుకోవడం వల్ల జుట్టు దెబ్బతింటుంది.

సిల్క్ పిల్లో: చర్మం మాదిరి జుట్టుకి కూడా అత్యుత్తమ సంరక్షణ అవసరం. జుట్టు ఆరోగ్యంగా, ఉండాలంటే సిల్క్ పిల్లోలని మాత్రమే ఉపయోగించాలి. ఇలా చేస్తే దిండుపై జుట్టు రాలడం తక్కువగా ఉంటుంది.

ఓపెన్‌ హెయిర్‌తో పడుకోండి: నిపుణుల అభిప్రాయం ప్రకారం ఓపెన్ హెయిర్‌లో పడుకోవడం జుట్టు ఆరోగ్యానికి మంచిది. జుట్టు ఎంత ఫ్రీగా ఉంటే రక్తప్రసరణ అంత బాగుంటుంది.


Next Story