మావోయిస్టు నేత కుమారుడి ఇంట్లో సోదాలు

by Dishanational1 |
మావోయిస్టు నేత కుమారుడి ఇంట్లో సోదాలు
X

దిశ, చేగుంట: మావోయిస్టు అగ్రనేత దుబాసి శంకర్ కుమారుడు దేవేందర్ ఇంటిలో ఎన్ఐఏ అధికారుల ఆధ్వర్యంలో గురువారం సోదాలు నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలో నివాసముంటున్న దేవేందర్ ఇంటి వద్దకు ఏడుగురు ఎన్ఐఏ అధికారుల బృందం చేరుకుని తండ్రికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దుబాషి శంకర్ భువనేశ్వర్ జైల్లో ఉన్నాడని కొడుకు దేవేందర్ వారితో చెప్పాడు. ఫోన్లో తండ్రితో మాట్లాడినట్లు కూడా వారికి చెప్పాడు.


Next Story