ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోన్న ఎన్ఐఏ దాడులు.. రాజస్థాన్ మర్డర్‌తో లింక్..?

by Disha Web |
ఓల్డ్ సిటీలో కలకలం రేపుతోన్న ఎన్ఐఏ దాడులు.. రాజస్థాన్ మర్డర్‌తో లింక్..?
X

దిశ, చార్మినార్: హైదరాబాద్‌లోని​పాతబస్తీ సంతోష్​నగర్‌లో ఎన్ఐఎ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సంతోష్​నగర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని ఖలిందర్​నగర్‌లో మదర్సాతోహిద్​ సెంటర్ మతగురువు మొహమ్మద్​మనోవర్ హుస్సేన్ అస్రఫి ఇంట్లో ఎన్ఐఎ అధికారులు దాడులు నిర్వహించారు. మదర్సాతోహిద్​సెంటర్‌తో పాటు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. మొహమ్మద్​మనోవర్​హుస్సేన్​అస్రఫితో పాటు మరో వ్యక్తిని ఎన్ఐఎ అధికారులు అదుపులోకి తీసుకుని 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం వారిని వదిలి పెట్టారు. ఈ నెల 14వ తేదీన జైపూర్‌లోని ఎన్ఐఎ ముందు హాజరు కావాలని నోటీసులు అందజేసింది. గత కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మనోవర్​హుస్సేన్​అస్రఫి‌కి ఫోన్​చేసినట్లు ఎన్ఐఎ అధికారులు గుర్తించారు.

బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఇటీవల ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్నయ్య లాల్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ప్రభుత్వం కేసును ఎన్ఐఏకి అప్పగించింది. అదే సమయంలో కన్నయ్యను హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయ్​పూర్ హత్య కేసులో నిందితులు ఫోన్​చేసిన వారిలో ఉన్నారన్న అనుమానంతో మనోవర్​హుస్సేన్​అస్రఫిని ఎన్ఐఎ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది. మనోవర్​హుస్సేన్ అస్రఫికి ఫోన్​చేసిన గుర్తు తెలియని వ్యక్తులు మహ్మద్​ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి శిక్షలు ఉంటాయని అని అడిగినట్లుగా తెలుస్తోంది.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed