మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. పనిలో చేరిన నెలలోనే భారీ దోపిడీ!

by Jakkula.Mamatha |

నేపాలి గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. పోలీస్ నిఘా ఉన్న అదును చూసి పడగ విప్పింది.

మరోసారి రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. పనిలో చేరిన నెలలోనే భారీ దోపిడీ!
X

దిశ, శేరిలింగంపల్లి: నేపాలి గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. పోలీస్ నిఘా ఉన్న అదును చూసి పడగ విప్పింది. గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త ఇంట్లో సుమారు 1 కేజీ బంగారు ఆభరణాలు, వజ్రాలు నేపాల్ గ్యాంగ్ ఎత్తుకేళ్లిపోయారు. ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన భార్యాభర్తలు ప్రధాన అనుమానితులుగా పోలీసులు భావిస్తున్నారు. నెల రోజుల క్రితమే వారిని పనిలో పెట్టుకున్న వ్యాపార వేత్త వద్ద నమ్మకంగా ఉన్నారు. అతని కుటుంబం ముంబైకి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేసరికి ఇంట్లో విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. పని మనుషులుగా వచ్చిన నేపాలీ దంపతులు అదృశ్యమయ్యారు.

ఇంట్లో తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్లిపోయారని భావించిన వ్యాపార వేత్త వారికోసం వాకబ్ చేశాడు. పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు, తదుపరి జరిపిన తనిఖీల్లో మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ​పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందాలు, నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Next Story