ఉద్యోగాల సృష్టికి తయారీని పెద్ద ఎత్తున చేపట్టాలి: ఆనంద్ మహీంద్రా!

by Disha Web |
ఉద్యోగాల సృష్టికి తయారీని పెద్ద ఎత్తున చేపట్టాలి: ఆనంద్ మహీంద్రా!
X

ముంబై: దేశీయంగా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తయారీని పెంచాల్సిన అవసరం ఉందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఈ ప్రయోజనాలను పొందడానికి ఇది సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కంపెనీ 76 వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, మన దేశానికి లభించే అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు అవసరమైన మార్గాలను అన్వేషించాలని, వీటిలో ముఖ్యమైనది ఉపాధి వృద్ధి, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఏకానమీ(సీఎంఐఈ) ప్రకారం, భారత నిరుద్యోగ రేటు 7-8 శాతం మధ్య ఉంది. జీడీపీ వృద్ధి స్థాయిలో ఉద్యోగాలు పెరగడం లేదని ఆయన పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్‌లో ఉద్యోగాలు పెరగకపోతే సామాజిక అశాంతి నెలకొనే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. 2023 నాటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది లక్షల మందిని నియమించే ప్రణాళికను ప్రకటించింది. దేశంలో 90 కోట్ల మంది శ్రామిక శక్తి ఉన్నందున, ఇంకా చాలా ఉద్యోగాలు సృష్టించాలన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా భారత్‌కు ఉన్న ప్రయోజనాలను అందుకోవాలి. ఇందులో ప్రధానంగా తయారీని పెద్ద ఎత్తున చేపట్టాలి. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు టెక్నాలజీని వినియోగించి స్థానిక తయారీని పెంచాలని ఆయన వెల్లడించారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed