'స్టార్ షేడ్స్' రూపకల్పనకు డిజైన్స్ ఆహ్వానిస్తున్న నాసా

by Disha Web Desk |
స్టార్ షేడ్స్ రూపకల్పనకు డిజైన్స్ ఆహ్వానిస్తున్న నాసా
X

దిశ, ఫీచర్స్ : 'హైబ్రిడ్ అబ్జర్వేటరీ' కాన్సెప్ట్‌ ప్రవేశపెట్టేందుకు నాసా ఓ అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఇది భూమి ఆధారిత టెలిస్కోప్‌ను అంతరిక్ష ఆధారిత స్టార్‌షేడ్‌తో మిళితం చేస్తుంది. స్టార్‌షేడ్ అనేది 'ఎక్సోప్లానెట్స్'ను గమనించేటప్పుడు నక్షత్రాల నుంచి కాంతిని నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. 'హైబ్రిడ్ అబ్జర్వేటరీ ఫర్ ఎర్త్-లైక్ ఎక్సోప్లానెట్స్(HOEE)' కాన్సెప్ట్ అతిపెద్ద 'టెరెస్ట్రియల్ టెలిస్కోప్స్‌'కు భూమి లాంటి గ్రహాలను కనుగొనడంలో సాయపడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో ప్రజలను కూడా భాగంచేయాలనే ఉద్దేశంతో ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్న నాసా.. ఇందుకోసం ప్రజల నుంచి డిజైన్స్ ఆహ్వానిస్తోంది.

HOEE కాన్సెప్ట్‌లో భాగంగా ఉపయోగించే తేలికపాటి స్టార్‌షేడ్ నిర్మాణాన్ని అభివృద్ధి చేసేందుకు 'అల్ట్రాలైట్ స్టార్‌షేడ్ స్ట్రక్చరల్ డిజైన్'ను రూపొందించాల్సిందిగా నాసా ప్రజలను ఆహ్వానిస్తోంది. ఈ డిజైన్ కాంపాక్ట్ ప్యాక్‌గా ఉండాలని, భూమి కక్ష్యలో ఉన్నప్పుడు దాన్ని విజయవంతంగా అమర్చుతామని వెల్లడించింది. ఇది సాధ్యమైనంత తేలికగా ఉండాల్సి ఉంది. తద్వారా కెమికల్ థ్రస్టర్స్ దాన్ని సమలేఖనం చేయడం సహా వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ప్రొపల్షన్ సిస్టమ్స్ దాని కక్ష్యను మార్చగలవు. ఈ డిజైన్‌ను ఆగస్టు 22లోగా దాఖలు చేయాల్సి ఉంది. మొదటి ఐదు సబ్‌మిషన్స్ $7,000 బహుమతిని పంచుకుంటాయి. పోటీ GrabCAD ద్వారా నిర్వహించబడుతుంది. సబ్‌మిషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను నాసా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

కక్ష్యలో ఉన్న నక్షత్రం నుంచి ప్రతిబింబించే కాంతిని గమనించడం ద్వారా అంతరిక్షంలోని ఎక్సోప్లానెట్ సంభావ్య నివాసయోగ్యతను గుర్తిస్తారు. అయితే ఈ కాంతి.. ఉపరితల ఖనిజాలు, మహాసముద్రాలు, ఖండాలు, వాతావరణం, వృక్షసంపద, దాని వాతావరణం ద్వారా ప్రభావితమవుతుంది. కానీ 'ప్లానెట్ స్టార్స్' తరచుగా భూ-ఆధారిత టెలిస్కోప్స్ నుంచి గ్రహాన్ని పరిశీలించేటప్పుడు ఒక కాంతిని ఉత్పత్తి చేస్తాయి. దీని వలన పరిశీలనకు అంతరాయాలు ఏర్పడతాయి. అందువల్ల 'స్టార్‌షేడ్స్' సదరు గ్రహాల నుంచి ప్రతిబింబించే కాంతిని నిరోధించకుండా నక్షత్రంపై డార్క్ షేడ్ వేస్తాయి.

అంతరిక్షం గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో హైబ్రిడ్ అబ్జర్వేటరీ మాకు సహాయపడవచ్చు. అనేక సిస్టమ్స్ గమనించడం వలన భూమి వంటి కాన్ఫిగరేషన్స్ ఎందుకు అరుదుగా ఉంటాయి. అవి భూమిలా ఎందుకు లేవు అనే ప్రశ్నకు సమాధాన్ని గుర్తించడంలో దోహదపడుతుంది. ఈ విప్లవాత్మక ప్రయత్నంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం నిజంగా ఉత్తేజకరమైన విషయం.

- జాన్ మాథర్, సీనియర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నాసా

Next Story

Most Viewed