Naga Chaitanya: 'లాల్ సింగ్ చడ్డా' బాలరాజుగా నాగచైతన్య న్యూ లుక్

by Nagaya |
Naga Chaitanyas First Look from Laal Singh Chaddha Is Out
X

దిశ, వెబ్‌డెస్క్: Naga Chaitanya's First Look from Laal Singh Chaddha Is Out| అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యలు కలిసి నటిస్తున్న సినిమా 'లాల్ సింగ్ చడ్డా'. ఆస్కార్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరపైకి తీసుకొచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. దీంతో చిరంజీవి తెలుగు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుతున్నారు. ఇటీవల కరీనా లుక్‌ను రిలీజ్ చేసిన చిరు.. తాజాగా నాగచైతన్య లుక్‌ను రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచారు. ''లాల్ సింగ్ చడ్డా, చెడ్డీ బడ్డీ 'బాలరాజు'ను మీకు పరిచయం చేస్తున్నా. అలనాటి బాలరాజు (అక్కినేని నాగేశ్వరరావు) మనవడు మన అక్కినేని నాగచైతన్యే ఈ బాలరాజు'' అంటూ పోస్టర్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. కాగా, ఆగస్టు 11న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి: పాపం నయనతార..పెళ్లితర్వాత సంతోషమే లేదు.. మరో వివాదంలో జంట

Next Story