Naga Chaitanya: నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు వీళ్లే.. నాగ చైతన్య ఎమోషనల్

by Disha Web |
Naga Chaitanya Shares Emotional Thank You Note On Instagram
X

దిశ, వెబ్‌డెస్క్: Naga Chaitanya Shares Emotional Thank You Note On Instagram| 'లవ్‌స్టోరీ'తో మంచి సక్సెస్ అందుకున్న అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. విడుదల తేదీ కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో నాగ చైతన్య బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 'థాంక్యూ' చిత్ర జర్నీ చైతు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టి ఎమోషనల్ అయ్యారు. ''థాంక్యూ నా నేను ఎక్కువగా ఉపయోగించే పదం కానీ, చాలా ముఖ్యమైన చోట ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. నా తదుపరి సినిమా థాంక్యూ ఈ ఆలోచనను ప్రతిబింభిస్తుంది. సినిమా ప్రయాణంలో నన్ను కదిలించిన విషయం ఇదే. ఈ పోస్ట్ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు ఈ చిత్రం అంకితం చేస్తున్నాను. వారికి కృతజ్ఞతలు చెప్పి సరిపెట్టలేను.

మిమ్మల్ని అర్ధం చేసుకునే వ్యక్తుల చిత్రాలను పంచుకోవడం మీ అందరికీ ఇష్టం ఉంటుంది కదూ.. అయితే #themagicwordistthankyou ను ట్యాగ్ చేయండి. అమ్మ కోరిక ఎప్పుడు నాతోనే ఉండిపోతుంది. అమ్మ నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది. నాన్న నాకు దిశానిర్ధేశం చేస్తాడు. నాతోనే ఉండిపోతాడు. ఇక నా స్నేహితుడు హాష్.. ఎలా ప్రేమించాలో, ఎలా ఉండాలో అనే అనుభూతులను కలిగించినందుకు నన్ను మనిషిగా ఉంచినందుకు థాంక్యూ'' అంటూ చెప్పుకొచ్చాడు. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed