చంద్రుడిపైన గుర్తుతెలియ‌ని స్పేస్‌క్రాఫ్ట్‌.. ఏలియ‌న్ల‌దేనా..?!

by Disha Web |
చంద్రుడిపైన గుర్తుతెలియ‌ని స్పేస్‌క్రాఫ్ట్‌.. ఏలియ‌న్ల‌దేనా..?!
X

దిశ, వెబ్‌డెస్క్ః అంత‌రిక్షంలో గ్రహాంతరవాసుల ఉనికి ఉంద‌న్న సంగ‌తి కేవ‌లం ఊహాగానాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవ్వ‌లేదు. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో అభివృద్ధి మేరుగ‌వుతున్న కొద్దీ ఏలియ‌న్ల ఎరుక మ‌రింత పెరుగుతోంది. అయితే, ఏలియ‌న్లు మ‌నుషుల కంటే సాంకేతికంగా మ‌రింత అభివృద్ధిని సాధించారా, చాలా తెలివిగ‌లవారా అనే విష‌యంలో స్ప‌ష్ట‌మైన ఆధారాలు ల‌భ్యం కాన‌ప్ప‌టికీ, ఆకాశంలో గుర్తుతెలియ‌ని సాస‌ర్లు, స్పేస్ క్రాఫ్ట్‌ల వ‌దంతుల్లో అస‌లు నిజం లేదు అన‌డానికి లేదు. ఎందుకంటే, చంద్రుడిపై ఓ మిస్టరీ స్పేస్‌క్రాఫ్ట్ క్రాష్ కారణంగా ఏర్పడిన డబుల్ క్రేటర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రునిపై ఇటీవ‌ల గుర్తించిన‌ ఈ బిలం సైంటిస్టుల‌ను అల‌ర్ట్ చేసింది. దీనికి సంబంధించి, తూర్పు బిలం 59 అడుగులు (18 మీటర్లు), పశ్చిమ బిలం 52.5 అడుగులు (16 మీటర్లు) కొలత‌ల‌తో ఉంది.

ఇక‌, గత ఏడాది చంద్రుడిపై గుర్తుతెలియని అంతరిక్ష వ్యర్థం కూలిపోయింద‌ని, దాని కార‌ణంగా ఒక బిలం ఏర్పడే అవ‌కాశం ఉంద‌ని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇక్కడ ఆస‌క్తి రేకెత్తించే విషయం ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన ఏ అంతరిక్ష వ్యర్థాల క్రాష్ ఇలా రెండు క్రేటర్‌లను ఏర్పరచలేదు. అందుకే, ఈ డబుల్ క్రేటర్ ఊహకంద‌నిదిగా ఉంద‌ని నాసా తెలిపింది. అయితే, దీన్ని పూర్తిగా ప‌రిశీలించిన త‌ర్వాత గానీ, ఈ గుర్తు తెలియ‌ని బిలాలు అంత‌రిక్ష నౌక‌ల్లో దేనికి సంబంధించిన‌వో, ఏలియ‌న్లకు సంబంధించిన ఏదైనా స‌మాచారాన్ని అందిస్తాయో లేదోన‌ని వేచి చూడాలంటున్నారు ప‌రిశోధ‌కులు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed