పరస్పర సహకారంతోనే అంతర్జాతీయ ఆర్థిక పునరుద్దరణ : ప్రధాని మోడీ

by Disha Web |
పరస్పర సహకారంతోనే అంతర్జాతీయ ఆర్థిక పునరుద్దరణ : ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: పరస్పర సహకరమే అంతర్జాతీయంగా ఆర్థిక పునరుద్దరణకు దోహదపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. చైనా నిర్వహిస్తున్న 14వ బ్రిక్స్ సమావేశాల్లో గురువారం ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం ద్వారా పౌరులు ప్రయోజనం పొందిన అనేక రంగాలు ఉన్నాయి. బ్రిక్స్ యూత్ సమ్మిట్‌లు, బ్రిక్స్ స్పోర్ట్స్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, థింక్-ట్యాంక్‌ల మధ్య కనెక్టివిటీని పెంచడం ద్వారా, మేము మా ప్రజల-ప్రజల అనుసంధానాన్ని బలోపేతం చేసాము' అని అన్నారు. న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు సభ్యులు పెరగడం హర్షనీయమని అన్నారు. సభ్య దేశాల మధ్య సహకారం పౌరులకు ప్రయోజనం కల్పిస్తున్నదని చెప్పారు.

తాజా చర్చలు సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సూచనలను అందిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల సముహం గత కొన్ని సంవత్సరాలుగా సంస్థ ప్రభావాన్ని పెంచే నిర్మాణాత్మక మార్పులను చేపట్టగలిగిందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు.

సభ్య దేశాల సహకారం అవసరం: పుతిన్

ఉక్రెయిన్‌పై పాశ్చాత్య ఆంక్షల కారణంగా పశ్చిమ దేశాల నుండి 'స్వార్థపూరిత చర్యల' నేపథ్యంలో సభ్య దేశాలు సహకరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. నిజాయితీ, పరస్పర ప్రయోజనకరమైన సహకారం ఆధారంగా మాత్రమే మనం ఈ సంక్షోభ పరిస్థితి నుండి బయటపడే మార్గాలను అన్వేషించగలమని అన్నారు. అంతర్-ప్రభుత్వ సంబంధాల నిజమైన బహుళ ధృవ వ్యవస్థ ఏర్పడటానికి ఏకీకృత, సానుకూల మార్గాన్ని అభివృద్ధి చేయడానికి బ్రిక్స్ దేశాల ఇప్పుడు అవసరమని మేము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్న అనేక ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ రాష్ట్రాల మద్దతుపై ఆధారపడవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులు పాల్గొన్నారు.

Next Story